NTV Telugu Site icon

Akhil Next: విశ్వంభర ఎఫెక్ట్.. అఖిల్ సినిమా ఇంకా ఆలస్యం?

Akhil Latest Look

Akhil Latest Look

యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ సన్నిహితులు స్నేహితులు కలిసి ప్రారంభించారు. మొదట్లో ఈ సంస్థకి వరుస హిట్స్ వచ్చినా, ఇప్పుడు చేసిన దాదాపు అన్ని సినిమాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒకరకంగా ఈ సంస్థ మీద ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చుపెట్టారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం కోసం దర్శకుడి రేంజ్ కంటే మించి ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. సినిమా సంక్రాంతికి రావాలి కానీ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సినిమా కోసం సంక్రాంతి సీజన్ వదిలేసుకుని వెనక్కి వెళ్లారు. మా సినిమా రెడీ గానే ఉంది కానీ చరణ్ బాబు కోసం వెనక్కి వెళ్ళాము అని ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా ప్రకటన చేశారు కానీ దానివల్ల మరో సినిమా మీద ప్రెజర్ పడినట్లు తెలుస్తోంది.

SSMB 29: రాజమౌళి – మహేష్ సినిమాకి నో లిమిట్స్

అదేంటంటే ఈ సినిమా మీద భారీగా పెట్టుబడులన్నీ పెట్టిన నేపథ్యంలో ఈ ప్రొడక్షన్ నుంచి రావాల్సిన మరో సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. విశ్వంభర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఆ తర్వాత అఖిల్- అనిల్ సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఇప్పటికే సినిమా పట్టాలు ఎక్కాలి కానీ విశ్వంభర కారణంగా సినిమా వాయిదా పడింది.. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. 2025 మధ్యలో సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్లే అవకాశం ఉంది. ఈలోపే మురళీ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించబోతున్నారు. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి సినిమా కారణంగా అఖిల్ సినిమా కాస్త వెనక్కి వెళ్లడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

Show comments