Site icon NTV Telugu

Gopichand 32: వెంకీ లాంటి కామెడీతో వస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం

Gopi

Gopi

Gopichand 32: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనందం, ఢీ, వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. అయితే అవన్నీ ఒకప్పుడు.. ప్రస్తుతం శ్రీను వైట్ల ప్లాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. కొన్నేళ్లుగా శ్రీను వైట్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక ఇప్పటికే శ్రీను వైట్ల చేతిలో ఢీ సీక్వెల్ ఒకటి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను ప్రకటించారు.. కానీ, ఇప్పటివరకు అది పట్టాలెక్కిందా .. ? లేదా.. ? అనేది తెలియదు. ఇక ఈ సినిమా కాకుండా ఈ మధ్యనే గోపీచంద్ తో శ్రీను వైట్ల ఒక సినిమాను పట్టాలెక్కించాడు. గోపీచంద్ 32 అనే పేరుతో మొదలు కానున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా కోసం శ్రీనువైట్ల కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

NTR: వచ్చే ఏప్రిల్ లో ఎన్టీఆర్ రెండు విధ్వంసాలని సృష్టించబోతున్నాడు

ఇక తాజాగా ఈ సినిమా కోసం మిలాన్ కు వెళ్ళాడు శ్రీనువైట్ల. అక్కడ కథ రాస్తూ కనిపించాడు. మిలాన్ లో షూటింగ్ మొదలైందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. “మిలన్ కు మేము వచ్చాము..అద్భుతమైన కథలు, కొన్ని మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలు మరియు వినోదాత్మక సినిమా.. గోపీచంద్ 32 సినిమా మిలాన్ లో మొదలైంది” అని చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ సైతం భారీ విజయం కోసం ఎంతగానో ఎదుచూస్తున్నాడు. ఇక ఈ కాంబోపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.వెంకీ లాంటి కామెడీతో వస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారి ఈ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి.

Exit mobile version