Gopichand31: గత కొన్నేళ్లుగా గోపీచంద్.. టాలీవుడ్ పై ఒక యుద్ధమే ప్రకటించాడు. యుద్ధంలో గెలుపు వచ్చేవరకు ఎలా పోరాడుతారో.. మనోడు కూడా హిట్ వచ్చేవరకు పోరాడుతూనే ఉంటున్నాడు. ఇక ఈ మధ్యనే వచ్చిన రామబాణం కూడా మిస్ ఫైర్ అయిన విషయం తెల్సిందే. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరో కొత్త సినిమాను లైన్లో పెట్టాడు. ఇప్పటివరకు గోపీచంద్.. తెలుగు, తమిళ్ దర్శకులతో కలిసి పనిచేశాడు. తనకు అచ్చివచ్చిన డైరెక్టర్స్.. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరితోనూ పనిచేశాడు. అయినా హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి కన్నడ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు గోపిచంద్. తాజాగా వీరి సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో వేద లాంటి యాక్షన్ సినిమా ను తెరకెక్కించి హిట్ అందుకున్న హర్ష దర్శకత్వంలో గోపీచంద్ 31 వ సినిమా తెరకెక్కనుంది.
OMG2: ఓ మై గాడ్.. శివతాండవం చేస్తున్న ఈ హీరోను గుర్తుపట్టారా..?
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పోరు ఫుల్ అప్డేట్ ను జూన్ 12 న రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆరోజు గోపీచంద్ బర్త్ డే కావడంతో.. ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. పోస్టర్ ను కానీ, టైటిల్ ను కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇక తెలుగు, తమిళ్ డైరెక్టర్ లు అయిపోయారు.. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తోనా మాస్టారు.. ఏది అయితే ఏం.. సినిమా హిట్ అయితే చాలు.. కంగ్రాట్స్ అంటూ గోపీచంద్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈసారి గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.