NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 సెట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో బాలయ్య కూడా పాలు పంచుకున్నాడు. చిత్రబృందం సమక్షంలో గోపీచంద్ కేక్ కోయగా, బాలయ్య స్వయంగా గోపీచంద్ కు కేక్ తినిపించారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నారు.
Read also : Vikram Release Date : మేకింగ్ వీడియోతో అనౌన్స్మెంట్
NBK 107లో ఇక బాలకృష్ణ పవర్ ఫుల్ రోల్ లో, డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. బాలయ్య సరసన నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించబోతున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 చిత్రానికి మేకర్స్ ‘వేటపాలెం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక NBK107 మూవీకి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
