NTV Telugu Site icon

Gopi Sundar: మళ్ళీ దొరికేశాడు.. ఫ్యామిలీ స్టార్ రెండో పాట అక్కడి నుంచి తస్కరించిందా?

Gopi Sundar

Gopi Sundar

Gopi Sundar Family Star Songs getting trolled for Copytunes: జులాయి సినిమాలో బ్రహ్మానందం పాత్రకి ఒక దొంగతనం వీక్ నెస్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా దొంగతనం చేస్తే నిమిషంలోనే పట్టుబడడం అతని స్పెషాలిటీ. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా దాదాపు అలాగే తస్కరించి అదేనండీ ఇన్స్పైర్ అయి ఈజీగా దొరికేస్తున్నారు. గతంలో ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ విషయంలో ట్రోల్ అయ్యేవాడు. ఇప్పుడు ఆ వ్యవహారం కాస్త తగ్గింది. తాజాగా మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో గీత గోవిందం వంటి మంచి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన గోపి సుందర్ సైతం ఈ అంశంలో టార్గెట్ అవుతున్నారు. మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాతో టాలీవుడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన ఆయన తర్వాత తెలుగులో చాలా మంచి చార్ట్ బస్టర్స్ ఇచ్చారు. వాటిలో పరశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం సినిమా సాంగ్స్ ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్. ఇలాంటి కాంబినేషన్ రిపీట్ అయిన క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమాకు కూడా గోపి సుందర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఆయన సినిమాకి మంచి మ్యూజిక్ ఇస్తాడని అనుకుంటే మొదటి పాట నంద నందనా సాంగ్ ఏమో తమిళ డబ్బింగ్ అనంతపురం ట్యూన్ ని పోలినట్టు ఉంది. కళ్యాణి వచ్చా వచ్చా అనే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఆ ట్యూన్ ఎక్కడో విన్నట్టు అనిపించిందని కాస్త బుర్రకు పదును పెట్టి ఆలోచిస్తే అరుంధతి సినిమాలో డోలారే డోలారే డం ట్యూన్ ని పోలినట్టే ఉంది.

Priyadarshi: హీరోగా మూడో సినిమా మొదలు.. మొదటిసారి స్టార్ డైరెక్టర్ తో!

సరే వాళ్ళు కూడా క్రియేటర్ లే కదా ఇన్స్పైర్ అయి ఉండవచ్చు అని లైట్ తీసుకుందాం అనుకుంటే ఈరోజు ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ చేశారు. ఆ పాట రిలీజ్ అయిన వెంటనే ఆ ట్యూన్ కూడా ఎక్కడో విన్నట్టు అనిపించింది. కాస్త గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే షారుఖ్, ఖాన్ ప్రీతి జంట జంటగా నటించిన దిల్సే సినిమా నుంచి జియా జలే సాంగ్ ట్యూన్ అది. రాగం యాజిటీజ్ ఉండడమే కాదు, ఇన్స్ట్రుమెంటేషన్ కూడా దాదాపు సేమ్ ఉండటం గమనార్హం. అయితే గోపి సుందర్ అభిమానులు మాత్రం భిన్న వాదన వినిపిస్తున్నారు. ఆయనకు మలయాళ సినిమాలు చేసుకునే టైమే లేదు, కావాలని తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఆయన వెంటపడి మ్యూజిక్ చేయమని అడుగుతున్నారు. ఆయన ఏదోలా చుట్టేయాలి కాబట్టి చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద కాపీ మరకలు పడుతున్నాయి, మన దర్శక నిర్మాతలు ఆయన వెంట పడకుండా తెలుగులో ఎంతోమంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు. వాళ్లకి అవకాశం ఇస్తే క్వాలిటీ మ్యూజిక్ దొరికినట్టు అవుతుంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.