Gopi Ganesh: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రేపు పుట్టిన రోజును ఘనంగా జరపాలనుకున్నారు అభిమానులు. అయితే దురదృష్టం ఏమంటే.. ఆయన కాలుజారి పడటంతో పాదం దగ్గర బెణికింది. మూడువారాలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. ఈ విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఈ విశ్రాంతి సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్ చూడటానికి తనకు సలహా ఇవ్వమని కోరారు. దాంతో చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవలే విడుదల తమ ‘గాడ్సే’ చిత్రాన్ని చూడాల్సిందిగా దర్శకుడు గోపీ గణేశ్ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఓ సలహా ఇచ్చాడు.
‘డైనమిక్ కేటీఆర్ సార్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న నా సినిమా ‘గాడ్సే’ ను మీరు చూడండి. ఇవాళ్టి యువతను దృష్టిలో పెట్టుకుని నేనీ సినిమాను తీశాను. మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. మీ రివ్యూ కోసం ఎదురుచూస్తూ ఉంటాను’ అని పోస్ట్ లో గోపీ గణేశ్ పేర్కొన్నాడు. సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ సినిమా కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైంది. అయితే దీనికి అక్కడ పెద్దంత స్పందన లభించలేదు. అయితే చిత్రంగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడంతో మొదలైన దగ్గర నుండి దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. గోపీ గణేశ్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాను మరి కేటీఆర్ చూస్తారా? రివ్యూ రాస్తారా? అనేది వేచి చూడాలి.
Gopi Ganesh Latest Tweet:
Wishing you a speedy recovery Dynamic KTR sir. Pls do watch my film GODSE on @NetflixIndia. I made it for our youth and am hopeful you will like it. Will be waiting for your review sir . 🎬 @KTRTRS #KTRReview #KTR #SpeedyRecoveryKTR https://t.co/uppQ9aNKkK pic.twitter.com/YKuwLd09qZ
— Gopi Ganesh (@MeGopiganesh) July 23, 2022