Site icon NTV Telugu

Pawan Kalyan: ఇది ఖచ్చితంగా పవన్ ఫ్యాన్స్ చొక్కాలు చింపుకొనే న్యూసే..?

Jalsa

Jalsa

Pawan Kalyan: అభిమానం.. ముఖ్యంగా తెలుగు వాళ్ళ అభిమానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా థియేటర్స్ వద్ద అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా వచ్చి ఎన్నేళ్లు అవుతున్నా అదే సీన్ రిపీట్ అవుతుంది అని నిరూపించారు మహేష్ ఫ్యాన్స్. ఇటీవలే పోకిరి సినిమాను 4కె లో కన్వర్ట్ చేసి మహేష్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన విషయం విదితమే. ఇక వింటేజ్ మహేష్ ను చూడడానికి మహేష్ ఫ్యాన్స్ థియేటర్ కు బారులు తీరారు. ఇప్పుడే విడుదలైన సినిమాలా మహేష్ ఎంట్రీకి ఫ్యాన్స్ చేసిన రచ్చ చూస్తే షాక్ అవ్వాల్సిందే. థియేటర్ తెరను చింపేశారు. కుర్చీలను విరగొట్టేశారు. ఇక కొన్నిచోట్ల అయితే మహేష్ కు హారతులు పట్టారు.

ఇక ఈ హంగామా మొత్తం చూసాకా పవన్ ఫ్యాన్స్ కూడా జల్సా సినిమాను 4 కె లో కన్వర్ట్ చేసి రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. పవన్ పుట్టినరోజున జల్సాను మళ్లీ రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు. ఇక అభిమానుల కోరిక తెలుసుకున్న గీతా ఆర్ట్స్ జల్సాను 4కె లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకొని పవన్ కంబ్యాక్ సినిమాగా రికార్డులను బద్దలుకొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా రిలీజ్ అయితే ఇక పవన్ ఫ్యాన్స్ ను ఆపడం ఎవరి తరం కాదేమో అనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ సినిమా ఎఫెక్ట్ చూసాక థియేటర్స్ యాజమాన్యం కొంత జంకుతుందని తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ న్యూస్ నిజమైతే పవన్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 న చొక్కాలు చింపుకోవడం ఖాయం. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Exit mobile version