Site icon NTV Telugu

Ramcharan – Sukumar : రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. రేపే బిగ్ అనౌన్స్మెంట్..

Whatsapp Image 2024 03 24 At 11.21.27 Pm

Whatsapp Image 2024 03 24 At 11.21.27 Pm

మెగా అభిమానులకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబుల్ ట్రీట్ అందిస్తున్నారు.. ఇప్పటికే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను బుధవారం (మార్చి 20న) పూజతో ప్రారంభించారు.ఇదిలా ఉంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ కాంబోలో మరో మూవీ రాబోతుంది.  గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ చేశారు.. మెగా అభిమానులకు ఈ మూవీ ప్రత్యేకం అని చెప్పొచ్చు.. నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రామ్ చరణ్ సిద్ధం అయ్యారు. సోమవారం ఆ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.’రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కలిసి పని చేస్తారని, మరో సినిమా చేయడానికి ఇద్దరూ సుముఖంగా ఉన్నారని చాలా రోజుల నుంచి ఫిల్మ్ నగర్, మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. బర్త్ డే వరకు కాదు అంత కంటే ముందుగా సినిమా ప్రకటన రానుంది.లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే… సోమవారం (మార్చి 25న) రామ్ చరణ్ – సుకుమార్ కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు. వాళ్లిద్దరి కలయికలో ‘రంగస్థలం’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్. ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు ముందు బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. ఆ మేరకు సన్నాహాలు జరిగాయి. ఆ రెండు సినిమాల తర్వాత సుక్కు సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. హీరోగా రామ్ చరణ్ కు 17వ చిత్రమిది చరణ్ బర్త్ డేకి మరిన్ని స్పెషల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version