Good Bye Trailer: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తెలుగులోనే కాకుండా ఆమె హిందీలో కూడా పాగా వేయడానికి బయల్దేరింది. హిందీలో రష్మిక నటిస్తున్న మొదటి చిత్రం గుడ్ బై. అమితాబచ్చన్, నీనా గుప్తా, సునీల్ గ్రోవర్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రానికి వికాస్ బహల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులును విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. రష్మిక- అమితాబ్ తండ్రి కూతుళ్లుగా కనిపించారు. సొంత కాళ్లపై నిలబడాలనుకొనే కూతురు.. తల్లిదండ్రులపై పిల్లలు ఆధారపడితే తప్పేంటి అనే తండ్రి మధ్య జరిగిన కథగా ఈ సినిమాను తెరక్కించారు.
తల్లి చనిపోతే కూతురు అంత్యక్రియలు చేయకూడదు.. అమెరికాలో ఉన్న కొడుకులు రావాల్సిందే అని మంకు పట్టు పట్టిన తండ్రితో కూతురు గొడవ పడుతోంది. ఇక కొడుకులు, తల్లి చనిపోయినా పట్టించుకోకుండా పార్టీ చేసుకోవడం, తండ్రి ఆచారాలు, అలవాట్లు తలనొప్పి తెప్పించడం లాంటివన్నీ ట్రైలర్ లో చూపించారు. చివరికి కూతురు, తన తండ్రి ఆలోచనలను అర్ధం చేసుకుందా..? కూతురు మనస్తత్వాన్ని తండ్రి ఎలా అర్ధం చేసుకున్నాడు..? అనేది కథగా తెలుస్తోంది. తండ్రీకూతుళ్లుగా రష్మిక- బిగ్ బీ అదరగొట్టేశారు. ఇక తల్లిగా నీనా గుప్తా కనిపించింది. మొత్తానికి ట్రైలర్ తోనే ఫ్యామిలీ మొత్తాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు డైరెక్టర్. మరి థియేటర్ లో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
