NTV Telugu Site icon

Good Bad Ugly: అజిత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. బీస్ట్ మోడ్ ఆన్ అయినట్టే!

Good Bad Ugly For Sankranthi

Good Bad Ugly For Sankranthi

Good Bad Ugly Ajith First Look, Movie In Cinemas Pongal 2025: చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారం నిజం అయి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ కుమార్‌ ఒక సినిమా చేయనున్నారు. తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కథ అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమా గురించి సినిమా యూనిట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. అదేమంటే ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Actress Sangeetha: డబ్బు కోసమే స్టార్ కమెడియన్ తో పెళ్లి.. నటి సంగీత క్లారిటీ!

గతంలో విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ అజిత్‌ను మూడు విభిన్న వ్యక్తీకరణలతో స్టైలిష్ ఉత్తమ అవతార్‌లో చూపిస్తోంది. మూడు విభిన్న షేడ్స్‌తో అజిత్ పాత్ర ఉన్నట్టు సూచిస్తుంది. గ్రీన్ ప్రింటెడ్ చొక్కా ధరించగా దానిపై డ్రాగన్ ఆకారాలు ఉన్నాయి. ఇక అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్నాడు. అజిత్ చేతిపై డ్రాగన్ టాటూలు, డ్రాగన్ ఆకారపు బ్రాస్‌లెట్‌ని మనం చూడవచ్చు. టేబుల్‌పై చాలా మారణాయుధాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది.

Show comments