Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..

Gold Spot

Gold Spot

Gold Spot Glimpse: ‘గోల్డ్ స్పాట్’ (Gold Spot) సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఈ రోజు వచ్చేశాయి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా.. ఆయన శిష్యుడు వేణు కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియో వింటేజ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పాత జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఎంతో రిఫ్రెషింగ్‌గా సాగింది. పచ్చని చెట్లు, పల్లెటూరి చాయ్ కొట్లు, చిన్ననాటి అమాయకమైన ప్రేమకథను ప్రతిబింబించేలా విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.

90ల నాటి బాల్యం గుర్తొస్తే చాలు.. టీ కొట్లు, పచ్చని చెట్లు, స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, ఎలాంటి టెన్షన్ లేని ఆ రోజులు కళ్ల ముందు మెదులుతాయి. ఇప్పుడు అలాంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. పెద్దగా కథను బయటపెట్టకుండా.. బాల్యం, స్నేహం, అనుబంధాల చుట్టూ తిరిగే ఓ అందమైన కథను ఈ సినిమా చెప్పబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఫస్ట్ లుక్‌లో చిన్నప్పుడు ఒకే చోట ఆడుకుంటూ పెరిగిన పిల్లలు.. పెద్దయ్యాక అదే ప్రదేశానికి తిరిగి వచ్చినట్టుగా చూపించారు. దీంతో గతంలో ఎంతో సంతోషంగా గడిపిన రోజులు, అక్కడి జ్ఞాపకాలు కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రం సినిమాకు ఓ ప్రత్యేకమైన ఫీల్ ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ ను మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు మేకర్స్. ట్రైలర్, రిలీజ్ డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.