Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Spot Glimpse: ‘గోల్డ్ స్పాట్’ (Gold Spot) సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఈ రోజు వచ్చేశాయి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా.. ఆయన శిష్యుడు వేణు కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియో వింటేజ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పాత జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఎంతో రిఫ్రెషింగ్‌గా సాగింది. పచ్చని చెట్లు, పల్లెటూరి చాయ్ కొట్లు, చిన్ననాటి అమాయకమైన ప్రేమకథను ప్రతిబింబించేలా విజువల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి.
90ల నాటి బాల్యం గుర్తొస్తే చాలు.. టీ కొట్లు, పచ్చని చెట్లు, స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, ఎలాంటి టెన్షన్ లేని ఆ రోజులు కళ్ల ముందు మెదులుతాయి. ఇప్పుడు అలాంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. పెద్దగా కథను బయటపెట్టకుండా.. బాల్యం, స్నేహం, అనుబంధాల చుట్టూ తిరిగే ఓ అందమైన కథను ఈ సినిమా చెప్పబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఫస్ట్ లుక్‌లో చిన్నప్పుడు ఒకే చోట ఆడుకుంటూ పెరిగిన పిల్లలు.. పెద్దయ్యాక అదే ప్రదేశానికి తిరిగి వచ్చినట్టుగా చూపించారు. దీంతో గతంలో ఎంతో సంతోషంగా గడిపిన రోజులు, అక్కడి జ్ఞాపకాలు కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రం సినిమాకు ఓ ప్రత్యేకమైన ఫీల్ ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ ను మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు మేకర్స్. ట్రైలర్, రిలీజ్ డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు