Site icon NTV Telugu

Pravasthi Issue: ఆ అమ్మాయి బట్టలు నేనే సెలెక్ట్ చేసే దాన్ని.. ప్రవీణ కడియాల వీడియో రిలీజ్

Praveena

Praveena

Pravasthi Issue: ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం మీద సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆమె జడ్జిలుగా వ్యవహరించిన సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌ల మీద అనుచిత ఆరోపణలు చేయడమే కాక, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి కూడా సంచలన ఆరోపణలు చేసింది. తన వస్త్రధారణ విషయంలో కూడా అన్యాయం జరిగిందని, తన చేత ఎక్స్‌పోజింగ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. తాజాగా ఈ అంశాల మీద జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్పందించింది. ఆ సంస్థ నుంచి ప్రవీణ కడియాల ఒక వీడియో రిలీజ్ చేశారు. ముందుగా పాటల సెలక్షన్ గురించి మాట్లాడుతూ, ఒక్కొక్క సంస్థ దగ్గర కొన్ని పాటలకు మాత్రమే రైట్స్ ఉంటాయని, ఆ పాటల్లో మాత్రమే ఎంచుకుని పాడాల్సి ఉంటుందని, ఈ విషయం ఆమెకు తెలుసని అన్నారు. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా దాటవేశారని చెప్పుకొచ్చారు.

Read Also : Priyadarshi : రివ్యూలు రాయొద్దని చెప్పడం కరెక్ట్ కాదు.. స్పందించిన ప్రియదర్శి
అలాగే, ఏ పాట పాడాలనే విషయంలో సర్వ అధికారాలు పాడే వారికే ఉంటాయని, తమ దగ్గర హక్కులు ఉన్న ఆరు పాటలను సెలెక్ట్ చేసుకుంటే, అందులో ఒక పాటను ఫైనల్‌గా పాడే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. డ్రెస్సుల విషయంలో కూడా పూర్తి బాధ్యత తనదేనని, ఏ అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనే విషయం తానే ఫైనల్ చేసేదాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాక, ఒకవేళ నిజంగానే తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఆమె బాడీ గురించి మాట్లాడి ఉంటే, ఎలిమినేషన్‌కు ముందే ఎప్పుడు అన్నాడో అప్పుడే మాట్లాడి ఉంటే బాగుండేదని, అంతా ఎలిమినేషన్ అయిపోయాక ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. జడ్జిల మీద ఆమె ఆరోపణలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, జడ్జిలుగా వారు ఏదైనా తీర్పు వెలువరిస్తే, దాన్ని తాను కానీ, ఇంకెవరు కానీ ఎదురు మాట్లాడలేమని చెప్పుకొచ్చారు.

Exit mobile version