Ram Charan: డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Star Ram Charan Birthday Celebrations : RRR సినిమాతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగి పాన్ ఇండియా స్టార్ హీరోల్లో టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేయడం విశేషం. ఇక తండ్రి అయ్యాక జరుపుకుంటున్న ఈ బర్త్ డే రామ్ చరణ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీంతో మెగాభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల బృందం ప్లానో(డల్లాస్)లోని స్పైస్ రాక్ రెస్టారెంట్లో పుట్టినరోజును పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్నారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనదైన ముద్ర వేశారు, ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసత్వాన్ని కొనసాగించటం అంత సులభమైన విషయం కాదు.
Allu Arjun: టుస్సాడ్స్ లో బన్నీ మైనపు విగ్రహం.. ఇందులో రియల్ అల్లు అర్జున్ ఎవరో గుర్తు పట్టారా?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
అయితే చరణ్ ఎంతో బాధ్యతతో తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు, కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తండ్రి బాటలోనే నడుస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తరం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అని రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు హాజరైన అందరూ ఆయన ఎదుగుదలను ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిట్టి ముత్యాల, ఏపీటీఏ మాజీ అధ్యక్షుడు నటరాజ్ యెల్లూరి, డల్లాస్ బాబీ మరియు రాజేష్ కళ్లేపల్లిలతో పాటు శ్రీరామ్ మత్తి, సురేశ్ లింగినేని, కిషోర్ అనిశెట్టి, కిషోర్ గుగ్గిలపు, నరసింహ సత్తి తదితరులు హాజరయ్యారు. వెల్నాటి, సునీల్ తోట, సుధాకర్ అందే ఆప్త, నాగేశ్వర్ చందన, రత్నాకర్ జొన్నకూటి, అనిల్ చలమలశెట్టి తదితరులు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!