Site icon NTV Telugu

Ram Charan: డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు

Ram Charan Bday

Ram Charan Bday

Global Star Ram Charan Birthday Celebrations : RRR సినిమాతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగి పాన్ ఇండియా స్టార్ హీరోల్లో టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేయడం విశేషం. ఇక తండ్రి అయ్యాక జరుపుకుంటున్న ఈ బర్త్ డే రామ్ చరణ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీంతో మెగాభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల బృందం ప్లానో(డల్లాస్)లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో పుట్టినరోజును పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్నారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనదైన ముద్ర వేశారు, ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసత్వాన్ని కొనసాగించటం అంత సులభమైన విషయం కాదు.

Allu Arjun: టుస్సాడ్స్ లో బన్నీ మైనపు విగ్రహం.. ఇందులో రియల్ అల్లు అర్జున్ ఎవరో గుర్తు పట్టారా?

అయితే చరణ్ ఎంతో బాధ్యతతో తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు, కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తండ్రి బాటలోనే నడుస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తరం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అని రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు హాజరైన అందరూ ఆయన ఎదుగుదలను ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిట్టి ముత్యాల, ఏపీటీఏ మాజీ అధ్యక్షుడు నటరాజ్ యెల్లూరి, డల్లాస్ బాబీ మరియు రాజేష్ కళ్లేపల్లిలతో పాటు శ్రీరామ్ మత్తి, సురేశ్ లింగినేని, కిషోర్ అనిశెట్టి, కిషోర్ గుగ్గిలపు, నరసింహ సత్తి తదితరులు హాజరయ్యారు. వెల్నాటి, సునీల్ తోట, సుధాకర్ అందే ఆప్త, నాగేశ్వర్ చందన, రత్నాకర్ జొన్నకూటి, అనిల్ చలమలశెట్టి తదితరులు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.

Exit mobile version