NTV Telugu Site icon

Global Icon: అల్లు అర్జున్ ని గ్లోబల్ ఐకాన్ చేశారు… చరణ్ కి పోటీగానేనా?

Global Icon

Global Icon

మెగాహీరోగా గంగోత్రి సినిమాతో 2003లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాలో అల్లు అర్జున్ ని చూసి ఇతను హీరో ఏంట్రా అని ఆడియన్స్ అనుకునే దగ్గర నుంచి హీరో అంటే ఇలానే ఉండాలి అని పాన్ ఇండియా ఆడియన్స్ చేత అనిపించుకునే వరకూ అల్లు అర్జున్ సినిమా జర్నీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. స్టైల్, డాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ప్రతి విషయంలో సినిమా సినిమాకి ఆరితేరాడు అల్లు అర్జున్ అందుకే అతి తక్కువ కాలంలో ఆయన స్టైలిష్ స్టార్ అయ్యాడు. స్టార్ హీరో అయ్యి తనకంటూ సొంత మార్కట్ ని సౌత్ ఇండియా మొత్తం క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ పుష్ప సినిమా చేశాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ ని చేసింది. పుష్ప పార్ట్ 1 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఏంటో పాన్ ఇండియా మొత్తం చూసింది. పుష్ప 2 సినిమా షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్, ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయిన సంధర్భంగా సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా చేస్తున్నారు.

దాదాపు లక్షన్నర ట్వీట్స్ వేసి నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. 20 ఇయర్స్ ఆఫ్ అల్లు అర్జున్ అనే టాగ్ తో పాటు అందరికీ షాక్ ఇస్తూ “Global Icon Allu Arjun” అనే హాష్ ట్యాగ్ ని కూడా అల్లు అర్జున్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అనేది మాత్రమే అల్లు అర్జున్ పేరు ముందు వాడే ఫాన్స్ సడన్ గా ‘గ్లోబల్ ఐకాన్’ అని ట్రెండ్ చెయ్యడం ఏంటో ఎవరికీ అంతుబట్టని విషయంగా ఉంది. రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అంటున్నారు కాబట్టే అల్లు అర్జున్ పేరు ముందు గ్లోబల్ ఐకాన్ చేర్చారు అనేది ఒక వర్గం మెగా అభిమానుల నుంచి వినిపిస్తున్న కామెంట్స్. మరి ఈ ట్యాగ్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ట్రెండ్ చేస్తున్న వారికే తెలియాలి. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా నుంచి ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా ఒక అప్డేట్ బయటకి తీసుకోని రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ అప్డేట్ ఇవ్వడంతో పుష్ప 2 ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవల్లో కిక్ స్టార్ట్ చేస్తున్నారు.