Site icon NTV Telugu

Krishna : మామ బర్త్ డేన ‘మామ మశ్చింద్రా’ అంటున్న సుధీర్ బాబు

Sudheer

Sudheer

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఆయన అల్లుడు, హీరో సుధీర్ బాబు తన కొత్త సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. తన సినిమాల కథల విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించే సుధీర్ ఈ తాజా సినిమా విషయంలో కూడా టైటిల్ తోనే ఆశ్చర్యపరిచాడు. జయాపజయాలక అతీతంగా ముందుకు సాగుతున్న సుధీర్ బాబు తాజా సినిమా ‘మామ మశ్చింద్రా’. రచయిత, దర్శకుడు హర్షవర్ధన్ తో ఈ సినిమా చేస్తున్నాడు సుధీర్. మామ, సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో సుధీర్ మరో సారి తన సిక్స్ ప్యాక్ తో అలరించటమే కాకుండా తన జిమ్నాస్ట్ స్కిల్ ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.

Exit mobile version