Site icon NTV Telugu

Vijay Deverakonda: యాదాద్రిలో దేవరకొండకి షాకిచ్చిన లేడీ ఫ్యాన్.. వామ్మో ఇలా ఉన్నారేంటి?

Vijay Deverakonda Lady Fan Shock

Vijay Deverakonda Lady Fan Shock

Girl Fan shocks Vijay Deverakonda for a click at Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సుల వల్లే మా అన్నదమ్ముల సినిమాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఇటీవలే బేబీ సినిమాతో హిట్ కొట్టిన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి సినిమా యూనిట్ సభ్యులతో కలిసి బ్రేక్ దర్శనం టైంలో శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు విజయ్ దేవరకొండ. ఖుషి సినిమా యూనిట్ తో దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో పలుమార్లు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నానని… సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని అన్నారు. పునర్నిర్మాణం తర్వాత దేశంలో ప్రముఖ ఆలయంగా యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకుందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని అని కామెంట్ చేశారు విజయ్ దేవరకొండ.

Kushi: ఖుషి సినిమాపై రేటింగ్స్ దాడి.. విజయ్ పై బూతుల వర్షం.. వెనకున్నది వారే?

ఇక ఈ క్రమంలో ఖుషి టీమ్ ను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే కారు దిగిన తర్వాత విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తల్లితో కలిసి ఖుషి టీమ్ తో గుడి వైపు వెళుతున్న సమయంలో ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఒక అమ్మాయి ప్రయత్నిస్తూ గుంపులో దూరి ఒక్కసారిగా వెళ్లి విజయ్ దేవరకొండ ను హగ్ చేసుకున్నట్లుగా గట్టిగా పట్టుకుంది. ఒక్కసారిగా ఈ పరిణామాన్ని ఊహించని విజయ్ దేవరకొండ షాప్ కి గురయ్యాడు వెంటనే విజయ్ దేవరకొండ చుట్టుపక్కల ఉన్న సిబ్బంది అలర్టు అయి ఆమెను పక్కకు లాగే ప్రయత్నం చేయగా విజయ్ దేవరకొండ వారిని వారించి ఆమెతో ఫోటో దిగి పంపించి వేశాడు. అయితే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా? గుడిలో కూడా అమ్మాయిలు ఆయన వెంట పడుతున్నారు, వామ్మో ఇలా ఉన్నారేంటి? అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి.

Exit mobile version