NTV Telugu Site icon

Ghost Telugu: ‘ఘోస్ట్’ ఆగమననానికి డేట్ ఫిక్స్.. ఆరోజునే రిలీజ్!

Ghost Release Date

Ghost Release Date

Ghost Telugu Release Date Fixed: కన్నడ సినీ హీరోలలో టాప్ స్టార్ గా కొనసాగుతున్న శివ రాజ్ కుమార్ జైలర్ సినిమాలో కనిపించిన కొన్ని సీన్లతోనే దుమ్ము రేపారు. ఇక ఆయన ‘ఘోస్ట్’ అనే పాన్ ఇండియా యాక్షన్ సినిమా ఒక చేయగా దాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ‘ఘోస్ట్’ సినిమాను కర్ణాటకలో విజయ దశమి కానుకగా విడుదల చేశారు. అక్టోబర్ 19 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తుండగా తెలుగులో మాత్రం కాస్త లేటుగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగులో వచ్చే వారం విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 4న ‘ఘోస్ట్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి కన్నడ హిట్ ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని దర్శకత్వం వహించగా సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 31వ సినిమాగా ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మించారు.

‘Detective Teekshana’: కుత్తుకల కోట కూల్చే తీక్షణా!

ఇక నిజానికి ఈ సినిమాను దసరాకి తెలుగులో కూడా రిలీజ్ చేయాలి అనుకున్నా అప్పటికే రెండు సినిమాలు సహా మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సీనియాను వాయిదా వేస్తున్నారు. ఇక మరో పక్క అదే వారంలో తెలుగులో నవంబర్ 3న తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’, ‘సత్యం’ రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’, రక్షిత్ అట్లూరి ‘నరకాసుర’, వికాస్ ముప్పాల ‘ప్లాట్’తో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఈ ఘోస్ట్ సినిమాకి కన్నడ నాట మంచి హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.

Show comments