Site icon NTV Telugu

Ghattamaneni Fans: థమన్- ఓ మై బేబీ సాంగ్ పై నెగటివ్ ట్రెండ్… అభిమానులే చేస్తున్నారు

Ghattamaneni Fans

Ghattamaneni Fans

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఘట్టమనేని అభిమానులే. సినిమా జస్ట్ యావరేజ్ అన్నా చాలు దాన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ చేస్తారు తేడా కొడితే మాత్రం ఆ సినిమాని ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితం చేస్తారు. క్రిటిక్స్ బాగోలేదు అని రాసినా కూడా సినిమా తమకి నచ్చితే మాత్రం ఆ మూవీని రీజనల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు పెట్టే వరకూ తీసుకోని వెళ్తారు. ఇలా ఎప్పుడూ జెన్యూన్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఓ మై బేబీ నిన్న రిలీజ్ అయ్యింది. ఈ పాటతో సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది అనుకున్న మహేష్ ఫ్యాన్స్ కి పాట నచ్చినట్లు లేదు. సోషల్ మీడియాలో #OhMyBaby ట్యాగ్ క్రియేట్ చేసి మరీ నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు.

థమన్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్న ఘట్టమనేని ఫ్యాన్స్… ఇది గుంటూరు కారం సినిమా రేంజ్ కాదు, సాంగ్ బాగోలేదు అంటూ ఓపెన్ గానే ట్వీట్స్ చేస్తున్నారు. సర్కారు వారి పాట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా మహేష్ ఫ్యాన్స్ థమన్ వర్క్ పై కాస్త అప్సెట్ అయ్యారు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో సర్కారు వారి పాట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదు అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఇప్పుడు లిరిక్స్ బాగోలేవు, ఈ పాట అసలు మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ఉండాల్సిన స్థాయి పాట కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కి ఈ సాంగ్ వలన ఒరిగిందేమి లేదు, ఓ మై బేబీ పాటని సినిమా నుంచి తీసేయండి, ఇంకో పాటని రీప్లేస్ చేయండి అనే సూచనలు వినిపిస్తున్నాయి. ఒక హీరో ఫ్యాన్స్ ఇంత ఓపెన్ గా చెప్పడం మహేష్ అభిమానులకే చెల్లింది. మరి మేకర్స్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తారా లేక థియేటర్ లో వీడియో సాంగ్ చూసినప్పుడు సాంగ్ బాగుంటుంది అని వదిలేస్తారా చూడాలి.

https://twitter.com/Kishore_99990/status/1735138203982876895

https://twitter.com/irebelstarfan/status/1735137918585623025

https://twitter.com/tharunnayakdhfm/status/1735137667174772781

 

Exit mobile version