Site icon NTV Telugu

Ghati : పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..

Ghaati

Ghaati

Ghati : స్వీటీ అనుష్క పరిస్థితి ఈ నడుమ అస్సలు బాగుండట్లేదు. స్టార్ హీరోల సరసన సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. పోనీ లేడీ ఓరియెంటెడ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి.. ఆ రకంగా సినిమాలు చేస్తే అవి కూడా బెడిసికొడుతున్నాయి. భాగమతి తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఆమె చేసిన ఘాటీపై బాగానే అంచనాలు ఉన్నాయి. కానీ మూవీ రిలీజ్ కు చాలా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదాలు పడింది ఈ సినిమా. ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ షూటింగ్ అనుకున్న టైమ్ కు కాకపోవడంతో వాయిదా వేశారు. రెండో సారి జులై 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ సీజీ వర్క్ వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మూడోసారి సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేసి.. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

Read Also : The Paradise : ది ప్యారడైజ్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

కానీ అదే రోజున మరో నాలుగు సినిమాలు పోటీకి వస్తున్నాయి. తేజసజ్జా హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ మిరాయ్ పోటీకి దిగుతోంది. రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీతో పాటు శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా వస్తోంది. అలాగే విజయ్ ఆంటోనీ సినిమా ఒకటి వస్తోంది. ఈ నాలుగు సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతోంది. సోలోగా వచ్చి మంచి వసూళ్లు రాబట్టాలన్నది ఘాటీ మూవీ టీమ్ ప్లాన్. కానీ భారీ పోటీ ఉండటంతో థియేటర్ల కొరత ఏర్పడింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంటే గానీ ఇంతటి పోటీని తట్టుకుని మూవీ వసూళ్లు రాబట్టలేదు. ఈ సినిమాకు అనుష్క వల్లే క్రేజ్ ఏర్పడుతోంది. పైగా క్రిష్ మీద ఉన్న నమ్మకం. పైగా సినిమాకు ట్రైలర్ తో బజ్ పెరిగింది. మరి ఘాటీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Read Also : Vijay Devarakonda : దారి తప్పుతున్న విజయ్ దేవరకొండ నిర్ణయాలు..

Exit mobile version