Site icon NTV Telugu

వరల్డ్ ఆఫ్ ‘గని’ అంటూ ఆసక్తికర అప్డేట్

Ghani

Ghani

వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “గని”. వరుణ్ అభిమానులతో పాటు స్పోర్ట్స్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘గని’. మేకర్స్ ఈ రోజు ‘గని’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర, తనికెళ్ల భరణి, నరేష్, నదియా, ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారికి సంబంధించిన పాత్రలను రివీల్ చేశారు. అంతేకాదు ఈ చిన్న వీడియోలో ఈ నెల 15న టీజర్‌ను భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.

Read Also : సోనూసూద్ ను వెనుక కోటి మంది!

సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన హైలైట్ ఏమిటంటే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. కిరణ్‌ కొర్రపాటి కథను అందించడంతో పాటు మెగాఫోన్ చేతపట్టాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా ఇప్పుడు టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Exit mobile version