Site icon NTV Telugu

‘గని’వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

ghani

ghani

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కొద్దిగా కోలుకొంటోంది. థియేటర్లు కళలాడుతోన్నాయి.. దీంతో వరుస సినిమాలు థియేటర్లకు క్యూ కట్టాయి. ఇక ‘అఖండ’ చిత్రంతో డిసెంబర్ శుభారంభం అయ్యింది.. ఇకపోతే ప్రస్తుతం అఖండ తరువాత అందరి చూపు నెక్స్ట్ సినిమాలపైనే ఉన్నాయి. డిసెంబర్ 17 న పుష్ప సింగిల్ గా వస్తుండగా.. డిసెంబర్ 24 న నాని శ్యామ్ సింగరాయ్, వరుణ్ తేజ్ ‘గని’ ఢీకొట్టబోతున్నాయి. అయితే ఈ రేస్ నుంచి తాజాగా గని తప్పుకొంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

” గని మాకు చాలా దగ్గరైన సినిమా.. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం.. డబ్బుకు వెనుకాడకుండా భారీ సెట్స్ ని , అరుదైన ప్రదేశాలను ఎంచుకున్నాము.. ప్రేక్షకులను ఒక మంచి విజువల్ ఫీల్ వచ్చేలా సినిమాను ప్లాన్ చేశాం.. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ రికవర్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో మా సినిమాను విడుదల చేయడం కష్టంగా ఉంది.. వాటితో క్లాషెస్ లేకుండా మరో రిలీజ్ తేదీని చూడాలనుకుంటున్నాము.. ఎందుకంటే ఈ క్లాషెస్ వలన మేకర్స్ బిజినెస్ పై దెబ్బ పడుతోంది. గని ఖచ్చితంగా థియేటర్లోనే రిలీజ్ అవుతుంది.. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తాము” అంటూ చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version