Site icon NTV Telugu

‘గని’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే…?

Ghani

Ghani

డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లను బాక్సింగ్ రింగ్ గా మార్చేసి తన ప్రతాపం చూపించబోతున్నాడు వరుణ్ తేజ్! అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ‘గని’ మూవీ అదే రోజున జనం ముందుకు రాబోతోంది. ఇదే సమయంలో మరో పక్క ‘ఎఫ్ 3’తో నవ్వుల పువ్వులూ పూయించబోతున్నాడు ఈ మెగా ఫ్యామిలీ యంగ్ హీరో. ఇలా వైవిధ్యమైన రెండు చిత్రాలలో నటిస్తున్న వరుణ్ తేజ్… తొలిసారి బాక్సింగ్ జర్సీని ధరించడం విశేషమనే చెప్పాలి.

Read Also : “మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్

సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘గని’ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరో హైలైట్ ఏమిటంటే, ఈ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. కిరణ్‌ కొర్రపాటి కథను అందించడంతో పాటు మెగాఫోన్ చేతపట్టాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ‘గని’కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఈ నెల 26వ తేదీ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్ ట్వీట్ చేశారు. ‘గని ఆంథమ్’ పేరుతో ఇది వస్తుండటం విశేషం. మరి ‘తొలిప్రేమ’ తర్వాత మరోసారి జత కట్టిన వరుణ్ తేజ్, తమన్ జోడీ ఏ స్థాయి మ్యూజికల్ హిట్ ను ఈసారి అందుకుంటుందో చూడాలి.

Exit mobile version