మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గని’. ‘గని’ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన హైలైట్ ఏమిటంటే, ఈ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. కిరణ్ కొర్రపాటి కథను అందించడంతో పాటు మెగాఫోన్ చేతపట్టాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
Read Also : వైరల్ : ఆమె బాత్రూంలో నేనేందుకు ఉంటా ?… ప్రభాస్ నెవెర్ బిఫోర్ పంచులు
“గని ఆంథమ్” పేరుతో విడుదలైన ఈ టైటిల్ సాంగ్ అదిరిపోయింది. స్పోర్ట్స్ డ్రామాకు సరిపోయేలా తమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కు శ్రోతలు ఫిదా అవుతున్నారు. ఇక పాటలో ముఖ్యంగా “గని కనీవినీ యెరుగని” అనే పదం క్యాచీగా, కూల్ గా ఉంది. పాట కంటే వరుణ్ శిక్షణ విజువల్స్ పాటలో అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా కుదరగా, ఆదిత్య అయ్యంగార్, శ్రీ కృష్ణ, సాయి చరణ్, పృథ్వి చంద్ర కలిసి పాడారు.