Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఓ చిన్నపాటి తుపాను రేపిన “మేము కాపులం” వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒక వర్గం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసి, మరికొందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు గుట్టు విడిపోయింది. ఒక చిన్న వీడియో క్లిప్‌లో నటుడు గెటప్ శ్రీను, మెగా బ్రదర్ నాగబాబు కలిసి నటిస్తున్న ప్రాజెక్టుకు ‘మేము కాపులం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గెటప్ శ్రీను పేర్కొనగా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జాఫర్ స్పందిస్తూ.. “కులం పేరుతో సినిమాలు తీయడం ఏంటి? ఇది సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుంది? నాకు అస్సలు నచ్చలేదు” అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. దీంతో గెటప్ శ్రీను నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతా అని అంటూ వెళ్ళిపోవడం వైరల్ అవుతుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవ్వడంతో, నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఇదంతా ఒక తెలివైన ప్రమోషనల్ స్టంట్ అని తాజాగా స్పష్టమైంది. ఈ సిరీస్ అసలు టైటిల్ ‘మేము COPలం’ (Memu COPulam). ఇక్కడ COP అంటే ఆంగ్లంలో పోలీస్ అని అర్థం. అంటే ఈ సిరీస్ పోలీసుల చుట్టూ, వారి విధుల్లో ఎదురయ్యే కామెడీ మరియు సవాళ్ల చుట్టూ తిరుగుతుందని టీం క్లారిటీ ఇచ్చింది. ఉచ్చారణలో రెండు పదాలు ఒకేలా ఉండటంతో వచ్చిన చిన్నపాటి కన్ఫ్యూజన్‌ను మేకర్స్ తమ సిరీస్ పబ్లిసిటీకి చాలా చాకచక్యంగా వాడుకున్నారు. ఓటీటీ జీ5 (ZEE5) ఒరిజినల్స్‌లో భాగంగా ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ కామెడీ అని సమాచారం. పోలీసు శాఖలో జరిగే ఆసక్తికర పరిణామాలు, మన చుట్టూ ఉండే నేరగాళ్లను పోలీసులు తమదైన స్టైల్లో ఎలా పట్టుకుంటారనేది హిలేరియస్ గా చూపించబోతున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్, విడుదల తేదీ గురించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. పోలీసు డ్రెస్సులో గెటప్ శ్రీను పండించే కామెడీని చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
Also Read
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!