NTV Telugu Site icon

Geethanjali : గీతాంజ‌లి ఈజ్ బ్యాక్‌….అక్కా నువ్ మళ్లీ వస్తున్నావా?

Geethanjali

Geethanjali

Geethanjali sequel titled Geethanjali Malli Vachindhi shoot begins today: టాలీవుడ్లో అంజ‌లి న‌టించిన గీతాంజ‌లి సినిమా అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గీతాంజ‌లి సినిమాకు సీక్వెల్ సిద్ధ‌మైంది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ గీతాంజ‌లి సీక్వెల్ అనౌన్స్ మెంట్ చేసేశారు మేక‌ర్స్. గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది అనే పేరుతో తెర‌కెక్కిస్తున్న సినిమా వెన్నులో వ‌ణుకు తెప్పించే స్పైన్‌ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేక‌ర్స్. గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది సినిమా షూటింగ్ కూడా ఇవాళ్టి నుంచి మొద‌లైంది. కోన వెంక‌ట్ స‌మ‌ర్పిస్తున్న గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది సినిమాను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాయి.

Srikanth Iyengar: ఏం పీకుతాడో చూస్తా.. బూతులతో రెచ్చిపోయిన శ్రీకాంత్ అయ్యంగార్

అచ్చ తెలుగు అమ్మాయి అయినా ప్యాన్ ఇండియా రేంజ్‌లో మెప్పిస్తున్న అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా అయిన దీని నుంచి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఓ పాడుబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి క‌లిగిస్తూ, ఆక‌ట్టుకుంటోంది. ఇక గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి రామ‌చంద్ర క్లాప్‌కొట్టగా సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ స‌త్యనారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా డైర‌క్ట‌ర్ శివ తుర్ల‌పాటికి అంద‌జేశారు. ఈ సినిమాలో శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్ (డ‌బ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధ‌వ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌- స్క్రీన్ ప్లే కోన వెంక‌ట్‌ అందిస్తుండగా మాట‌లు భాను భోగ‌వ‌ర‌పు, నందు శ‌వ‌రిగ‌ణ‌ అందిస్తున్నారు. శివ తుర్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాకి ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నారు.

Show comments