Site icon NTV Telugu

Geetha Arts: నేషనల్ క్రష్ తో సెన్సిబుల్ డైరెక్టర్ సినిమా…

Geetha Arts

Geetha Arts

స్టార్ హీరోల సినిమాలకి, భారీ బడ్జట్ సినిమాలకి… ఈ మధ్య మీడియమ్ రేంజ్ సినిమాలకి కూడా కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది గీత ఆర్ట్స్. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న గీత ఆర్ట్స్… లేటెస్ట్ గా ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. అక్టోబర్ 22న వయం 11:07 నిమిషాలకి ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియజేస్తాం అంటూ ట్వీట్ చేసారు. #RaGaRa అనే హ్యాష్ ట్యాగ్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి రానున్న 51వ సినిమా. రేపు ఉదయం అఫీషియల్ గా డీటెయిల్స్ బయటకి రానున్న ఈ ప్రాజెక్ట్ లో… నేషనల్ క్రష్ రష్మిక మందన్న మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయనున్నాడు.

Read Also: Bhagavanth Kesari: భగవంత్ బాదుడు… హాప్ సెంచరీ కొట్టేశాడు!

చి లా సౌ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్… మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నాగార్జునతో చేసిన మన్మథుడు 2 సినిమా ఆశించిన రిజల్ట్ ని అందించలేదు. 2019లో మన్మథుడు 2 సినిమా రిలీజ్ అయ్యింది… అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు రష్మికతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అందుకే రష్మిక పేరులో నుంచి RA, గీత ఆర్ట్స్ పేరులో నుంచి GA, రాహుల్ రవీంద్రన్ పేరులో నుంచి RAని తీసుకోని #RaGaRa అంటూ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలి అంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version