Gayatri Gupta Sensational Allegations on Casting Couch: తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి సినిమాలు పడ్డాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా గ్యాప్ తర్వాత గాయత్రీ గుప్తా.. దయ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రేప్ కు గురి కాబడిన స్వేచ్ఛ అనే పాత్రలో నటించి మెప్పించింది. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి సంచలన కామెంట్స్ చేసింది.
Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
గతంలో నేను చేసిన కాస్టింగ్ కౌచ్ పోరాటానికి అంతగా ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. తర్వాత మరికొందరు నాలా పోరాడడం వల్ల ఇండస్ట్రీ స్పందించి ఓ కమిటీ వేశారు, అదిప్పుడు చాలా మంది బాధితులకు ఫ్లాట్‌ఫాం అయింది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం నేను గట్టిగా చెబుతున్నా, చాలా మంది హీరోయిన్లు ఇష్టంతో సెక్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం అవసరాల కోసం అలాంటి వాటికి ఒప్పుకుంటున్నారు, వాళ్లలో ఎక్కువ మంది అమాయకపు అమ్మాయిలే బలవుతున్నారని ఆమె కామెంట్ చేసింది. ఇక ఆ మధ్య డిప్రెషన్ వలన ఆమె ఆర్థరైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యాధి ఇప్పుడు ముదిరిపోయింది, ట్రీట్ మెంట్ కోసం రూ. 12 లక్షలు అవసరమని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రూ. 1.5 లక్షలు మాత్రమే ఉన్నాయి.. ఎవరైనా దాతలు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరింది.
