Site icon NTV Telugu

Gayathri Rao: హ్యాపీ డేస్ లో నిఖిల్ లవర్ అప్పు.. అయ్యబాబోయ్..ఇప్పుడేంటి ఇలా ఉంది

Appu

Appu

Gayathri Rao: ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగతున్న నిఖిల్ కు మొదటి హిట్ అంటే హ్యాపీ డేస్ అనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా తమన్నా, వరుణ్ సందేశ్ స్టార్లుగా గుర్తింపు పొందారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంజినీర్ విద్యార్థుల భవితను మార్చేసింది. ఈ సినిమా చూసి ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరినవారు కోకొల్లలు. ఇక వీరితో పాటు ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి గాయత్రీ రావు. ఒకప్పటి నటి పద్మ కూతురుగా ఆమె హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదట తమన్నాకు తగ్గట్టు తన పాత్రను డిజైన్ చేశారని, అందుకే తాను తన పొడవాటి జుట్టును కూడా కట్ చేసుకున్నట్లు చెప్పింది. అయితే సినిమా చూసాక.. తమన్నాకే మంచి పేరు వచ్చిందని ఆమె ఎన్నోసార్లు వాపోయింది.

Akhil Akkineni: అఖిల్ కు ఆ దోషం ఉంది.. ఆమె మాట వింటే..వేణుస్వామి సంచలన కామెంట్స్

ఇక అప్పుగా ఆమె నటనను కూడా తీసిపారేయడానికి లేదు. నిఖిల్ ను ఆటపట్టిస్తూ ఎంతో న్యాచురల్ గా కనిపించింది గాయత్రీ. ఇక ఆ సినిమా తరువాత గబ్బర్ సింగ్ లో శృతికి ఫ్రెండ్ గా మెప్పించిన ఈ చిన్నది తరువాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వివాహం చేసుకొని సెటిల్ అయ్యిపోయింది. 2019లో చెన్నెకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో ఆమె వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత ఈ చిన్నది చెన్నైలో సెటిల్ అయ్యింది. అయితే అప్పటికి, ఇప్పటికీ ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. కొద్దిగా బొద్దుగా తయారయ్యింది. ఏదేమైనా నట వారసత్వం ఆమెలో ఉంది. ముందు ముందు ఏమైనా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.

Exit mobile version