NTV Telugu Site icon

Bigg Boss 7: ప్రశాంత్‌కు డాక్టర్ బాబు షాక్.. భోలేని కూడా వదల్లేదు!

Bb7

Bb7

Gautham Krishna Shocks Pallavi Prashanth and Bhole Shavali in Nominations: తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 8వ వారంలో జరిగిన నామినేషన్స్ కూడా రచ్చ దారితీయగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తూ తీసిన లాజిక్స్ కి ప్రశాంత్, భోలే షావలికి షాక్ తగిలి ఏమీ మాట్లాడలేక పోయారు. సోమవారం రాత్రి ఎపిసోడ్‌లో ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి ఫొటోలను మంటల్లో కాల్చి.. అందుకు తగిన సమాధానాలను చెప్పాల్సి ఉంటుందని బిగ్ బాస్ సీఝేప్పగా గౌతమ్ కృష్ణ ప్రశాంత్, భోలే షావలిని నామినేట్ చేశాడు. అయితే అలా చేసే టైములో సమయంలో చెప్పిన పాయింట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తూ ‘సందీప్ మాస్టర్ విషయంలో నువ్వు మాట మార్చడం, అది అడిగిన నాగార్జున సార్ ముందు డిఫెండ్ చేసుకోలేకపోవడం నచ్చలేదని రీజన్ చెప్పడంతో పాపం పల్లవి ప్రశాంత్ ఏమీ మాట్లాడలేకపోయాడు.

Subrahmanyaa: మరో వారసుడు వస్తున్నాడు.. ఆ ‘సుబ్రమణ్య’మే కాపాడాలి!

వెంటనే రెచ్చిపోతూ అది అయిపోయిన మేటర్, సందీప్ మాస్టర్‌కు ఎప్పుడో సారీ చెప్పా అంటూనే ఒక రేంజ్ లో తన మేనరిజం చూపిస్తూ గౌతమ్‌తో వాదనకు దిగగా గౌతమ్ డాక్టర్ బాబు చాలా కూల్‌గా ప్రశాంత్‌కు ఆన్సర్ ఇచ్చాడు. అలాగే నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, మరి నాగార్జున సార్ అడిగినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఎందుకు ఏడ్చావు? అదంతా యాక్టింగా? అని అడగ్గా అప్పుడు ప్రశాంత్ యాక్టింగ్ చేస్తుంటే నువ్వు ఇప్పుడు నటించకు నేనేమీ ఆడిషన్స్ తీసుకోవట్లేదు అంటూ షాకిచ్చాడు. ఆ తర్వాత భోలే షావలిని నామినేట్ చేస్తూ మీరు టాస్కులో ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నారని అనిపిస్తుంది అంటే భోలే గౌతమ్‌ను వెక్కిరిస్తున్నట్లు పాటలు పాడుతూ తనలో అపరిచుతుడిని నిద్ర లేపాడు. నువ్వు డాక్టర్ అయితే చేయి పట్టుకుని బీపీలు చూడు, నేను వీకో కాదు అప్పుడు చెప్పు అంటూ గౌతమ్ డాక్టర్ వృత్తిపై కామెంట్స్ చేశాడు. అయినా సరే గౌతమ్ కూల్‌గా హ్యాండిల్ చేస్తూ ఆకట్టుకున్నాడు.