Site icon NTV Telugu

Rocking Rakesh: హీరోగా జబర్దస్త్ కమెడియన్.. రోజా చేతుల మీదుగా సినిమా ఓపెనింగ్

Rocking Rakesh New Movie

Rocking Rakesh New Movie

Rocking Rakesh as hero: జబర్దస్త్ కమెడియన్లు అనేక మంది సినిమాల్లో కామెడియన్లుగా మాత్రమే కాదు కొందరు హీరోలుగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. షకలక శంకర్, సుడిగాలి సుధీర్ వంటి వారు ఇప్పటికే హీరోలుగా పలు సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు రాకింగ్ రాకేష్ కూడా హీరోగా మాయాడు. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘జబర్దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాకి డీవోపీగా పని చేసి 10త్ క్లాస్ డైరీస్ సినిమాతో డైరెక్టర్ గా మారిన అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ కొట్టగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, ఒకప్పటి జబర్దస్త్ జడ్జ్ రోజా సెల్వమణి కెమెరా స్విచాన్ చేశారు.

Vishwak Sen: విశ్వక్ దేవరకొండను టార్గెట్ చేశాడా?

ఇక ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించగా సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు. ఇక వీరే కాక ఈ సినిమా ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మంత్రి రోజా సెల్వమణి మాట్లాడుతూ రాకేష్ నా కొడుకు లాంటి వాడు, ఎప్పటి నుంచో తనకి లీడ్ రోల్ చేయాలని ఉంది అది ఈ సినిమాతో నెరవేరుతోందని అన్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మరెన్నో సినిమాలు చేసి ప్రజలకు ఆనందాన్ని పంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ రాకేష్ ప్రతిభావంతుడు హీరోగా, నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. రాకేష్ మా గురువుగారు రాళ్ళపల్లి గారికి ఇష్టమైన శిష్యుడు, చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి రాకేష్ మరో పది సినిమాకు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

Exit mobile version