Risk Movie: మీకు సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ గుర్తుండే ఉంటాడు. సిక్స్ టీన్ వంటి యూత్ సినిమాలకు మ్యూజిక్ అందించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారుతున్నాడు. గతంలో ఇంకా ఏదో కావాలి పేరుతో ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో సందీప్ అశ్వ అనే హీరో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు సందీప్ అశ్వ హీరోగా ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో ‘రిస్క్’ అనే మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కొత్తదా లేదా పాత సినిమాకు టైటిల్ మార్చారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలకు ఒకే హీరో, ఒకే నిర్మాత, ఒకే దర్శకుడు అయినప్పుడు సినిమా టైటిల్ మారి ఉంటుందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
Read Also: Avatar2: చరిత్ర సృష్టించిన అవతార్-2.. అగ్రస్థానం కైవసం
అయితే రిస్క్ మూవీ గతంలో వచ్చిన సిక్స్ టీన్స్ సినిమాకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన విడుదల చేశాడు. ఈ మూవీలో సందీప్ అశ్వా, రవీంద్రనాథ్ ఠాకూర్, తరుణ్ సాగర్ . విశ్వేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అత్యాశతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని అనుకున్న ఓ నలుగురు యువకులకు ఎదురైన పరిణామాలతో నేటి ట్రెండ్‌కు తగినట్లుగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రిస్క్ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఘంటాడి కృష్ణ తెలిపాడు. ఈ చిత్రంలో మొత్తం 8 పాటలు ఉంటాయని.. ప్రముఖ గాయకుడు సిధ్ శ్రీరామ్ ఆలపించిన పాటను ఈ వీక్‌లోనే రిలీజ్ చేస్తామని వెల్లడించాడు. కాగా రిస్క్ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది.
Presenting you high intense title and first look motion poster of Pan Indian film #RISK🔥
►https://t.co/a8e6Keq9Qk@SandeepAshwa #Sanyathakur #ZoyaZaveri @KrishnaGantadi #TharunSagar #GKMusicals #Ravindranathtagore #Vishwesh #Rajeevkanakala #GkMiracles @adityamusic pic.twitter.com/DNc2kkXRBS
— Vamsi Kaka (@vamsikaka) January 21, 2023