Site icon NTV Telugu

Gangubai Kathiawadi : మా అమ్మను వేశ్యగా… మేకర్స్ కు షాక్ ఇచ్చిన గంగూబాయి తనయుడు

Gangubai Khathiyawadi

Gangubai Khathiyawadi

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషంగా ఉన్న చిత్రబృందం ఆనందాన్ని ఆవిరి చేస్తూ గంగూబాయి తనయుడు సినిమాపై ఫైర్ అయ్యాడు. గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ చిత్రం పట్ల సంతోషంగా లేరని తెలుస్తోంది.

Read Also : Arabic Kuthu challenge : అదరగొట్టేసిన పూజాహెగ్డే

గత ఏడాది బాబూ రావుజీ షా చిత్రంపై పిటిషన్ దాఖలు చేయడంతో ముంబై కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​​జారీ చేసింది. అయితే తర్వాత “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. అంతే కాదు చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు కేసు పెండింగ్‌లో ఉంది. సినిమా విడుదల సందర్భంగా గంగూబాయి కుమారుడు బాబూ రావుజీ షా మాట్లాడుతూ సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. “నా తల్లిని వేశ్యగా మార్చారు. ప్రజలు ఇప్పుడు మా అమ్మ గురించి చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు” అని అన్నారు.

గంగూబాయిపై సినిమా రూపొందుతోందని తెలిసినప్పటి నుంచి, అంటే 2020 నుంచి ఆమె కుటుంబం అజ్ఞాతంలో ఉందని, తరచుగా ఇళ్లు మారుతోందని గంగూబాయి కుటుంబం తరఫు న్యాయవాది నరేంద్ర వెల్లడించారు. గంగూబాయి మనవరాలు భారతి కూడా మేకర్స్‌పై విరుచుకుపడింది. డబ్బు కోసం దురాశతో కుటుంబం పరువు తీశారని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ “మేకర్లు డబ్బుపై దురాశతో నా కుటుంబం పరువు తీశారు. దానిని అంగీకరించలేము. ప్రాజెక్ట్‌తో ముందుకు సాగడానికి ముందు మీరు మా కుటుంబం సమ్మతిని అడగలేదు. మీరు పుస్తకం రాసేటప్పుడు మా వద్దకు రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి తీసుకోండి. నా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను ఎలా చూపిస్తున్నారు? ” అంటూ ప్రశ్నించారు.

Exit mobile version