అలియా భట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘గంగూబాయి కతియావాడి’ గత ఏడాది నుండి విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ప్రతిసారీ ఏదో ఒక విడుదల తేదీని ప్రకటించి, కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్లాన్ చేశారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, సంజయ్ లీలా బన్సాలీ తన సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘గంగూబాయి కతియావాడి’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇది ప్రతిష్టాత్మకమైన 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, అదే సమయంలో భారత్‌లో కూడా విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా విజయం థియేటర్ల ఓపెనింగ్ పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుంది.
Read Also : ‘సలార్’ అప్డేట్… ఆద్యను పరిచయం చేసిన టీం
ఈ సినిమాలో ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో అలియా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత ఏడాది ఈ సినిమా టీజర్ మాత్రమే విడుదలైంది. ఇందులో అలియా బోల్డ్ అవతార్ లో, స్ట్రాంగ్ డైలాగ్స్ మాట్లాడుతూ కనిపించింది. సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్రాన్ని కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వివాదం కూడా చెలరేగింది. గంగూబాయి కుటుంబానికి చెందిన కొందరు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
