NTV Telugu Site icon

Gangs Of Godavari: డేట్ మార్చిన విశ్వక్.. ఈసారి ఎప్పుడంటే.. ?

Vishwak

Vishwak

Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Naga Chaitanya: ఆమెకు వినే ఓపిక లేదు.. అందుకే ఆమె లైఫ్ లో ఎవరు ఉండరు

చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి కథగా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. ఇక మొదటి నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ లో కన్ప్యూజన్ గానే ఉంది. మొదట ఈ సినిమా డిసెంబర్ 8 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వలన తమ ఇనిమ డిసెంబర్ 8 నుంచి మార్చి 8 కి మారిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. షూటింగ్ ఇంకొంత బ్యాలెన్స్ ఉందని, ఇక అయ్యేలోపు.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా వర్క్ అవుట్ అవ్వదని తెలిసి.. మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు. మరి విశ్వక్.. సమ్మర్ లో వచ్చే సినిమాలతో ఢీకొని హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Show comments