NTV Telugu Site icon

Shivam Bhaje: గూస్ బంప్స్ తెప్పించేలా ‘శివం భజే’ టీజర్

Shivam Bhaje First Cut

Shivam Bhaje First Cut

Ganga Entertainments ‘Shivam Bhaje’ Powerful Teaser out now: మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘శివం భజే’. ఇది వరకే టైటిల్, ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ నేడు రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. అప్సర్ దర్శకత్వంలో న్యూ ఏజ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్ , యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ కూడా ఉన్నట్టు టీజర్ లో అర్ధమవుతోంది. హీరో అశ్విన్ కి ఏదో మానసిక సమస్య ఉన్నట్లు బ్రహ్మాజీ, హైపర్ ఆదిలతో చెప్పడం, ఇన్వెస్టిగేషన్ లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీనా వంటి పలువురు నటులు నిమగ్నమై ఉండడం, అయ్యప్ప శర్మ ద్వారా వీటన్నిటి వెనుక దైవం ఉనికి ఉందని తెలియజేయడం ఆసక్తికరంగా ఉంది.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంలో ట్విస్ట్..

ఇక మరోపక్క అశ్విన్ బాబు రౌద్ర రూపంలో రౌడీలను శూలంతో ఎత్తి పడేయడం… అన్నిటినీ మించి చివరగా అదిరిపోయే సీజీ విజువల్స్ లో దాచిన శివుని దర్శనం, దానికి వికాస్ బడిస బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సస్పెన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు డివోషన్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. మా దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకు తెస్తాం” అన్నారు.