NTV Telugu Site icon

Game Of Thrones: తెలుగులో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. ఆ సీన్స్ ఉంటాయా మాస్టరూ.. ?

Got

Got

Game Of Thrones: హాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ లో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ ఎండ్ అవుతుంది అని తెలిసి తెలుగు ప్రేక్షకులే ఎక్కువగా బాధపడ్డారు అంటే అతిశయోక్తి లేదు. జాన్ స్నో, మదర్ ఆఫ్ డ్రాగన్స్, స్టార్క్స్ ఫ్యామిలీ.. ఇలా అందులోని పాత్రలను అభిమానులు ఓన్ చేసుకున్నారు. డేవిడ్ బెనియాఫ్, డి.బి.వైస్ సృష్టించిన అమెరికన్ ఫేంటసీ డ్రామా టీవీ సీరీస్ ఇది. 2011 లో మొదలైన ఈ సిరీస్.. 2019 లో ముగిసింది. వెస్టెరోస్, ఎస్సోస్ అన్న కల్పిత ఖండాల్లో రెండు రాజ్యాల మధ్య జరిగే పోరాటాన్ని ఇందులో చూపించారు. మొత్తం 8 సీజన్స్ ఉన్నాయి. అయితే ప్రతి సీజన్ ఒక అద్భుతమనే చెప్పాలి. వారి కాస్ట్యూమ్స్ దగ్గరనుంచి లొకేషన్స్ వరకు మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక 8 సీజన్స్ చాలామందే ఉంటారు కానీ, కొంతమంది తెలుగులో లేకపోవడంతో ఈ సిరీస్ ను చూడాలనుకున్న చూడలేకపోయారు.

Salman Khan: జైల్లో టాయిలెట్స్ కడిగా.. సల్మాన్ సెన్సేషనల్ కామెంట్స్

ఇక అలాంటివారి కోసం జియో సినిమాస్ గుడ్ న్యూస్ చెప్పింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ 8 సీజన్స్ ను తెలుగులో డబ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ నుంచి వచ్చిన జియో సినిమాస్ ద్వారా డిజిటల్ రంగంలో మొదటి స్థానంలోకి వెళ్లాలని చూస్తున్న విషయం తెల్సిందే. దీంతో కొత్త కంటెంట్ తో పాటు.. అభిమానులకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది తెలుసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వార్నర్ బబ్రదర్స్ తో చేతులు కలిసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రాంతీయ భాషల్లో చూసే సౌలభ్యాన్నీ కల్పించారు. తెలుగు, హిందీ, మలయాళ కన్నడ భాషల్లో ఈ సిరీస్ ను వీక్షించవచ్చు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఎగిరి గంతులేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ఇందులో ఇంగ్లిష్ సిరీస్ లో ఉన్న రొమాంటిక్ సీన్స్ ను, న్యూడ్ సీన్స్ ను ఉంచుతారా.. సెన్సార్ అని కట్ చేస్తారా.. ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం తెలియాలంటే సిరీస్ జియో సినిమాస్ లో వచ్చేవరకు ఆగాల్సిందే. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు.