NTV Telugu Site icon

Game Changer: ఒక షార్ట్ షెడ్యూల్ కి చరణ్ రెడీ…

Game Changer

Game Changer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ బజ్ ని జనరేట్ చేసింది. ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ బయటకి రావట్లేదు కానీ షూటింగ్ ని మాత్రం సైలెంట్ గా చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఇటీవలే గేమ్ ఛేంజర్ మైసూర్ షెడ్యూల్ జరిగింది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్నారు చిత్ర యూనిట్ అంతా. నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ రెడీ అవుతున్నారు. క్రిస్మస్ పండగ అయిపోయిన మరుసటి రోజు… డిసెంబర్ 26న గేమ్ ఛేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ షూట్ చేయడానికి శంకర్ అండ్ చరణ్ రెడీ అయ్యారు. అయితే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ కొన్ని రోజులు మాత్రమే జరగనుంది. డిసెంబర్ 26 నుంచి 30 వరకు మాత్రమే ఈ షార్ట్ షెడ్యూల్ జరగనుంది. జనవరి నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తే గేమ్ ఛేంజర్ సినిమా 2024 ఫెబ్ నెలలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజర్ రిలీజ్ వచ్చే సమ్మర్ తర్వాతే ఉండే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ ఎలాగూ లేట్ అవుతుంది కాబట్టి మెగా ఫ్యాన్స్ కోసం మంచి అప్డేట్స్ అయినా బయటకి వదిలితే బాగుంటుంది. ఇప్పటికే ‘జరగండి’ సాంగ్ కోసం దీపావళికి బయటకి వస్తుందని మెగా ఫాన్స్ వెయిట్ చేసి బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఈసారి అలా మిస్ చేయకుండా మంచి అకేషన్ చేసుకోని ‘జరగండి’ సాంగ్ ని బయటకి వదిలితే… ఫ్యాన్స్ లో జోష్ వస్తుంది లేదంటే అసలు గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయంలో ఉంటారు. గేమ్ ఛేంజర్ ని శంకర్ త్వరగా కంప్లీట్ చేస్తే… చరణ్ బుచ్చిబాబుతో సినిమా కోసం రెడీ అవుతాడు. ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయ్యింది. చరణ్ ఓకే చెప్పడమే లేట్ సెట్స్ పైకి వెళ్లడానికి బుచ్చిబాబు రెడీగా ఉన్నాడు.