NTV Telugu Site icon

Game Changer : ‘జరగండి’ పాట వాయిదా.. తీవ్ర నిరాశలో మెగా ఫ్యాన్స్..

Whatsapp Image 2023 11 11 At 2.55.33 Pm

Whatsapp Image 2023 11 11 At 2.55.33 Pm

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీపై భారీగా హైప్ వుంది. తనకు గ్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ విపరీతంగా ఉంది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.డైరెక్టర్ శంకర్ ఇండియన్-2 మూవీ కూడా చేస్తుండటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో . అంజలి, ఎస్‍జే సూర్య, జయరామ్, సునీల్ కీలకపాత్రలు చేస్తున్నారు..

ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి ‘జరగండి’ అనే ఫస్ట్ సాంగ్‍ను దీపావళికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించటంతో రామ్‍చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసింది. అయితే, దీపావళి(నవంబర్ 12)కి మరో రెండు రోజుల సమయమే ఉన్నా.. పాట గురించి ఎలాంటి అప్‍డేట్ ఇవ్వలేదు మూవీ యూనిట్. కనీసం  చిన్న ప్రోమోను కూడా తీసుకురాలేదు. పాట రిలీజ్ డేట్, టైమ్‍ను కూడా మూవీ యూనిట్ ప్రకటించలేదు. దీంతో రామ్‍చరణ్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది.. పాట గురించిన అప్‍డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇంతలో ఈ విషయం గురించి చిత్రం యూనిట్ షాకింగ్ అప్డేట్ ఇచ్చింది.. తాజాగా ఈ సాంగ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ మేకర్స్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.. గేమ్ ఛేంజర్ ఆడియో డాక్యుమెంటేషన్‌లో నెలకొన్న సమస్యల కారణంగా పాటని వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటించారు.రామ్‌చరణ్‌, శంకర్‌ ఫ్యాన్స్ వెయిటింగ్‌కి తగ్గ వర్త్ తో జరగండి పాట ఉంటుంది. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా ది బెస్ట్ ఉంటుంది. క్వాలిటీతో కూడిన వినోదాన్ని అందించేందుకు మా టీమ్‌ ఎంతగానో కష్టపడుతున్నారు.. అంటూ నోట్ లో రాసుకొచ్చారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు

Show comments