NTV Telugu Site icon

GTA: 90స్ కిడ్స్ కనెక్ట్ అయ్యేలా వైస్ సిటీ సినిమా.. అక్టోబర్ 6నే రిలీజ్!

Gta Movie Release

Gta Movie Release

Game Based Movie GTA to Release on October 6th: మీ అందరికీ గ్రాండ్ తెఫ్ట్ ఆటో అదేనండీ చిన్నప్పుడు మనం ఆడిన వైస్ సిటీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ “GTA” గేమ్ ఆధారంగా నిర్మించిన సినిమా ఒకటి అక్టోబర్ 6న విడుదలకి రెడీ అయింది. అశ్వత్థామ ప్రొడక్షన్స్ లో చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా GTA అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతూ ఉండడం గమనార్హం. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్ ఎడిటర్. కె.వి.ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కానుందని సినిమా యూనిట్ వెల్లడించింది.

Manchu Manoj: ర్యాంప్ ఆడిద్దాం అంటున్న మంచు మనోజ్..

ఇక ఈ మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను రచయిత దర్శకుడు కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ… కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న GTA సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. 90కిడ్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్ తో ఈ సినిమా రాబోతోందని ఆయన అన్నారు. ఇక క్రైమ్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని, GTA అనే గేమ్ ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీయడం జరిగిందని దర్శకుడు దీపక్ సిద్ధాంత్ వెల్లడించారు. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, కుమనన్ లోబో, రూప లక్ష్మీ, రాఖీ, చిత్రం శ్రీను వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను డాక్టర్ సుశీల నిర్మించారు.