ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ల్లో గదర్ 2 ఒకటి.ఈ సినిమా లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంట గా నటించారు. ఈ సినిమా ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి లో కలెక్షన్లు సాధించింది.విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ ల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గా గదర్ 2 నిలిచింది.. ఇండిపెండెన్స్ డే కానుక గా ఆగస్టు 11న థియేటర్ల లో విడుదలైన గదర్ 2 సినిమా దాదాపు రూ. 600 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది.. థియేటర్ రన్ తర్వాత ఈ మూవీకి ఓటీటీ లో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రమే ఓటీటీ లో అందుబాటు లో ఉంది. జీ5 లో గదర్ 2 హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం గదర్ 2 తెలుగు వెర్షన్‌ను కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 1) నుంచి ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో స్ట్రీమింగ్ యాప్‌లో గదర్ 2 తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అందుబాటులో ఉండనుంది.2001లో వచ్చిన గదర్ కు సీక్వెల్ గా గదర్ 2 సినిమా తెరకెక్కింది.. గదర్ 2 సినిమాకు మొదటి పార్ట్‌కు మించి వసూళ్లు వచ్చాయి.. గత కొంత కాలం గా ప్లాఫ్‌లతో సతమతమవుతోన్న సన్నీడియోల్, అమీషా పటేల్‌లకు ఈ మూవీ అదిరిపోయే కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. గదర్ 2 సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా, మనీష్ వాద్వా, మనోజ్ భక్షి, ఆర్యా శర్మ మరియు సిమ్రత్ కౌర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోంటీ శర్మ మరియు మిథున్ మ్యూజిక్ అందించారు
