NTV Telugu Site icon

Gaami Teaser : విశ్వక్‌ సేన్‌ ‘గామి’ టీజర్ చూశారా? అఘోరగా విశ్వక్ అదరగోట్టాడుగా..

Gaami

Gaami

టాలీవుడ్ యంగ్ మాస్ హీరో విశ్వక్‌ సేన్‌ సినిమాలకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఆయన సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తాడు.. ఇప్పుడు ‘గామి’ సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా మొదలై చాలాకాలం అవుతున్న విడుదల కాలేదు.. త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా నుంచి వచ్చిన లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..

ఈ సినిమా సరికొత్త కథతో రాబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఈ టీజర్ లో ఓ మ్యాప్‌ని ఓపెన్‌ చేసి ఇదే ఈ సమస్యకి పరిష్కారం అనే వాయిస్‌తో టీజర్‌ సాగింది. కొందరు నగ్నంగా స్నానం చేస్తున్నారు. వణికిపోతున్నారు. మరోవైపు నటి అభినయ సైతం స్నానం చేస్తూ కనిపించింది. ఆ తర్వాత కాశీలో చాందిని ఫోటోలు తీస్తూ కనిపించింది. ఆ తర్వాత ఒక్కో పాత్ర రివీల్‌ అవుతుంది. దేన్నో వెతుకున్నారు. ఏదో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి శంకర్‌ అని పిలవగా, నల్లటి దుప్పటి కప్పుకుని కర్ర పట్టుకుని ఉన్న విశ్వక్‌ సేన్‌ లుక్‌ రివీల్‌ అవుతుంది..

మంచు పర్వతాల్లో నివసిస్తాడు.. ఇక టీజర్ చివరగా టైటిల్ ను రివిల్ చేస్తారు.. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ థ్రిల్లర్‌ని తలపిస్తుంది. ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అదే సమయంలో ఉత్కంఠకి గురి చేస్తుంది. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా కంటెంట్ ని చూపించే ప్రయత్నం చేశాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది.. మొత్తంగా చూసుకుంటే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఇకపోతే ఈ నెల 29 న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చెయ్యనున్నారు..