మహేశ్ బాబు తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా కంటే ముందే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు మహేశ్. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించటం విశేషం. త్రివిక్రమ్ తో మహశ్ ఇంతకు ముందు ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు చేశాడు. టీవీల్లో అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాల్లో ఈ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ సినిమాలో పూజా హేగ్డే కథానాయికగా నటించబోతోంది.
ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు ఆస్థాన సంస్థ అయిన హారిక హాసిని నిర్మించనుంది. శ్రీమతి మమత సమర్పణలో యస్. రాధాకృష్ణ నిర్మాతగా రూపొందే ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలన్ని పియస్ వినోద్ నిర్వహించనుండగా నవీన్ నూలి ఎడిటర్ గా, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరక్టర్ గా పని చేయనున్నారు. మహేశ్ 28గా తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ లో ఆరంభించి 2023 సమ్మర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో మూడో చిత్రంగా రానున్న ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
https://www.youtube.com/shorts/Weej4DEWLUg