NTV Telugu Site icon

Nithin : హీరో నితిన్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్

Nithin

Nithin

Nithin : హీరో నితిన్ నితిన్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. వరుసగా ఈవెంట్లతో హోరెత్తిస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 28న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మూవీపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో క్రేజ్ బాగా పెరిగిపోయింది.

read also : Viswaksen : విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్ట్

అయితే తాజాగా రాబిన్ హుడ్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను కండక్ట్ చేసింది. దీని కోసం మల్లారెడ్డి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. మరి మల్లారెడ్డి వస్తే హంగామా మామూలుగా ఉండదు కదా. పైగా తన ఇన్ స్టిట్యూట్ లో సినిమాల ప్రమోషన్లు ఆయన దగ్గరుండి చేయిస్తారు. అందుకే ఈ ఈవెంట్ లో అదిదా సర్ ప్రైజ్ అనే పాటకు నితిన్ తో కలిసి స్టేజి మీద మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. పంచెకట్టులో ఆయన చాలా హుషారుగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.