Site icon NTV Telugu

Tollywood : యంగ్ హీరో సినిమాకు నిర్మాతగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తనయుడు

Vishwak Sen

Vishwak Sen

టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వ‌క్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లైలా డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయిన విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ తో ఫంకీ అనే చేస్తున్నాడు. సితార ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read : Single : మంచు విష్ణు కు క్షమాపణలు చెప్పిన శ్రీ విష్ణు

ఈ సినిమాతో పాటు మరి కొన్ని కథలు వింటున్న విశ్వక్ సేన్ మరో సినిమాను కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కల్ట్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్టు సమాచారం. దర్శకుడు తదితర వివరాలు ఏవి తెలియలేదు కానీ ఈ సినిమాను తెలంగాణలోని బిఆర్ ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి తనయిడు నిర్మిస్తున్నాడట. గతంలో తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కల్ట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు చక చక జరుగుతున్నాయట. మిగిలిన వివరాలను త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు మేకర్స్.

Exit mobile version