Site icon NTV Telugu

పవన్ సినిమాలో పెంచల్ దాస్ పాట!

గాయకుడు పెంచల్ దాస్ పాడింది తక్కువ పాటలే అయినా అభిమానుల మనసుల్లో బలమైన ముద్ర వేశాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో ‘దారిచూడు దుమ్ముచూడు’.. శ్రీకారం సినిమాలో ‘వచ్చానంటివో పోతానంటివో’ వంటి పాటలతో మంచి గుర్తింపుపొందాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి సినిమాలో పెంచల్ దాస్ ఫోక్ సాంగ్ పాడనున్నట్లు తెలుస్తోంది. మొదట పవన్ కళ్యాణ్ పాడతాడనే ప్రచారం జరుగగా.. తాజాగా పెంచల్ దాస్ పేరు వినబడుతోంది. సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఓ నేపథ్యగీతాన్ని పెంచలదాస్ చేత పాడించాలని మేకర్లు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇదివరకు పెంచల్ దాస్ ‘అరవింద సమేత’ సినిమాలో తమన్ తో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version