NTV Telugu Site icon

PS-2: కొత్త సౌండ్ డిజైన్ ఆస్కార్ కోసమేనా?

Ps 2

Ps 2

నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చింది. ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ మూమెంట్ గా నిలిచిన ఈ క్షణాన్ని మరోసారి నిజం చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తమిళ నేల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆస్కార్ గెలిచిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ 2 సౌండ్ డిజైన్ తో మరోసారి ఆస్కార్ వేదికపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియా మూవీని మేకింగ్ మాస్టర్ మణిరత్నం డైరెక్ట్ చేస్తున్నాడు. పార్ట్ 1తో అయిదు వందల కోట్లు వసూళ్లు చేసిన పొన్నియిన్ సెల్వన్ సినిమా, పార్ట్ 2తో తమ దగ్గర ఉన్న అన్ని గన్స్ ని ఫైర్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. రిలీజ్ కి రెడీ అవుతున్న పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ‘ఆగనందే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. రెహమాన్ కంపోజ్ చేసిన ట్యూన్ కి అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ అండ్ శక్తీ శ్రీ గోపాలన్ వాయిస్ కూడా కలిసి సాంగ్ ‘ఆగనందే సాంగ్’ని మరింత స్పెషల్ గా మార్చాయి. సూథింగ్ మ్యూజిక్ తో బయటకి వచ్చిన ఈ సాంగ్ యుట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉంటే మణిరత్నం, రెహమాన్ లు కలిసి లండన్ లోని ‘ఆబీ స్టూడియోస్’లో పొన్నియిన్ సెల్వన్ 2 సౌండ్ డిజైన్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాకి, ఆరు నెలల క్రితమే వర్క్ అయిపోయిన సినిమాకి రెహమాన్ ఇప్పుడు కొత్తగా సౌండ్ డిజైన్ పై ఎందుకు కూర్చున్నాడు అని ఆలోచిస్తే టార్గెట్ ఆస్కార్ గా కనిపిస్తోంది. రెండు అకాడెమీ అవార్డ్స్ గెలుచుకున్న రెహమాన్ కి లైకా లాంటి స్ట్రాంగ్ ప్రొడక్షన్ హౌజ్ సపోర్ట్ ఉంటే ఎంత దూరం అయినా వెళ్లగలడు. సౌండ్ డిజైన్ లో తిరుగులేని రెహమాన్ పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ఇండియాకి మరో ఆస్కార్ తెస్తాడేమో చూడాలి.

Show comments