Site icon NTV Telugu

Guntur Kaaram: ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్… ఫస్ట్ సాంగ్ వచ్చే టైమ్ అయ్యింది

Ssmb 28 Guntur Kaaram

Ssmb 28 Guntur Kaaram

ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం మాస్ స్ట్రైక్ పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ మాత్రమే రిలీజ్ చేశారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ జస్ట్ పోస్టర్స్‌తోనే సరిపెట్టారు మేకర్స్. అయితే తమన్ మాత్రం ఇప్పటికే అదిరిపోయే ట్యూన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది.

గుంటూరు కారం ఫస్ట్ సాంగ్‌ని ఆగష్టు ఎండింగ్‌లో రిలీజ్ చేయనున్నారనే టాక్ నడిచింది కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫస్ట్ సింగిల్‌ని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 19న వినాయక చవితి ఉంది కాబట్టి.. మేకర్స్ నుంచి అఫిషీయల్ అప్టేడ్ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఒకవేళ వినాయక చవితికి మిస్ అయితే.. అక్టోబర్‌లో దసరా రోజున సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే.. మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి.. నెక్స్ట్ రాజమౌళితో ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ రెండు మూడేళ్ల సమయాన్ని కేటాయించనున్నాడు.

Exit mobile version