NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: ఆ అపవాదు పోగొట్టుకునేందుకు ఈ వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్?

Bigg Boss7

Bigg Boss7

First male contestant elimination Happened in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి కాగా ఆరుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ విషయంలో చాలా మంది బాధ పడుతున్నారు. ఇక ఈ క్రమంలో అమ్మాయిల మీద బిగ్ బాస్ కక్ష కట్టింది అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ అపవాదు పోగొట్టుకునేందుకు బిగ్ బాస్ సిద్ధం అయింది. ఇక చివరగా, బిగ్ బాస్ తెలుగు 7లో మొదటి పురుష కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లోని అన్ని ఎలిమినేషన్లలో మహిళా కంటెస్టెంట్లు మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఈ వారం మొదటి మగ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆట సందీప్, కార్తీక దీపం శోభలకు ఈ వారంలో తక్కువ ఓట్లు వచ్చాయని, ఈ వారం సందీప్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజం అయిందని అంటున్నారు. నిజానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండా.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే!

ముందు నుంచి ఆట సందీప్ కూడా ఒక గట్టి పోటీదారుగా ఉన్నాడు. మొదటి వారం నుండి 8 వ వారం వరకు నామినేషన్లలోకి సైతం ప్రవేశించలేదు. అలా ఇప్పటివరకు నామినేట్ అవ్వకుండా కూడా రికార్డు సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ ఈ పని చేయలేకపోయాడు, కానీ సందీప్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే ఆయన నామినేషన్స్‌లో లేకపోవడంతో ఆయన ఓటు బ్యాంకు పెద్దగా లేదు. ఈ క్రమంలో తొలిసారి నామినేషన్‌లో అడుగుపెట్టడంతో ఓటు బ్యాంకు లేక ఎలిమినేట్ అయినట్లు సమాచారం. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆదివారం జరుగుతుంది కానీ శనివారమే షూట్ చేస్తారు. కాబట్టి ఆ షూట్ పూర్తి కాగానే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ముందే రివీల్ కావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు సందీప్ ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు 7లో తొలి పురుష కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరగడంపై ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.